ప్రభుత్వ పథకాల అమలు పై నివేదికలు సిద్ధం చేయండి : జిల్లా కలెక్టర్

"రైతుబంధు, కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ, క్రొత్త రేషన్ కార్డులకు అర్హుల అంచనాలు, పెన్షన్ల, మహాలక్షి, గృహాలక్ష్మి వివరాలతో నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ " రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నివేదికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 21 (గురువారం)న హైదరాబాద్ లో రాష్ట్ర ముఖ్య మంత్రి, కలెక్టర్ల సమావేశం ఉన్నందున, మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, తహసీల్దార్ లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నివేదికలను సిద్ధం...