TS : నేటి నుంచి తునికాకు సేకరణ
తెలంగాణ : ఏప్రిల్ 15 మండలాలలోని ఏజన్సీ గ్రామాల్లో గిరిజనులు, గిరిజనేతర కుటుంబాలు శనివారం నుండి తునికాకు సేకరణ ప్రారంభించాయి. మండలంలోని 2 యూనిట్ల ద్వారా 25 వేల స్టాండర్డు బ్యాగుల లక్ష్యంగా అటవీశాఖ అధికారులు ఆకు సేకరణకు పిలుపునివ్వడంతో గ్రామాల్లో తునికాకు సేకరణతో కుటుంబాల్లో సందడి నెలకొంది. పనులు లేని వేసవిలో ఆకు సేకరణ పలు కుటుంబాలకు ఆదాయం సమాకూర్చుతుండడంతో పల్లె ప్రజలు తెల్లవారుజాము నుండే అడవులకు వెళ్లి ఆకు సేకరిస్తున్నారు. 50 ఆకుల కట్టకు ప్రభుత్వం రూ.1.25లు ఇస్తుండగా కాంట్రాక్టు వర్గాలు మరో 25 పైసలు కలిపి రూ.1.50లు ఇస్తుండడంతో ఒక్కో కుటుంబం రోజు 200-300 రూపాయల వరకు ఆదాయం పొందేలా ఆకు...