మంత్రి వర్గం నుంచి కేటీఆర్ ను వెంటనే బర్తరఫ్ చేయాలి : సూర్యకాంత్ గిత్తే

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో ఐటీ శాఖమంత్రి కేటీఆర్ ను వెంటనే భర్తరఫ్ చేయాలని బీజేపీ నాయకుడు బోథ్ నియోజకవర్గ కన్వీనర్ సూర్యకాంత్ గిత్తే డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దీనిపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలను నీరు గార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం లీకేజీలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. పరీక్షలు రాసిన అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ. 1 లక్ష చొప్పున నష్టపరిహారాన్ని...