Flash News: ప్రమాదం జరిగిన చోట మరో రోడ్డు ప్రమాదం

ప్రమాదాలకు నిలయంగా జాతీయ రహదారి...! అర్ధరాత్రి జరిగిన ఘటనా స్థలంలోనే మరో ప్రమాదం...!! రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఆదివారం అర్థరాత్రి గుడిహత్నూర్ మండలం సీతాగొంది జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన చోటే మరో ప్రమాదం సంభవించింది.  హైద్రాబాద్ నుండి నాగపూర్ వెళ్తున్న వాహనాలు అదుపు తప్పి ఒకదానికి ఒకటి వరుసగా మూడు కంటైనర్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు.  నిన్న అర్ధరాత్రి జరిగిన ప్రమాద స్థలంలోనే ఇప్పుడు మరో ప్రమాదం జరగడం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది.  జాతీయ రహదారి ములమలుపు వద్ద ప్రమాద సూచిక బోర్డులు లేకపోవడం, ఎత్తైన కొండ ప్రాంతం వద్దనే ములమలుపు ఉండడంవల్లనే...