నిషేధిత గుట్కా స్వాధీనం, ఇద్దరి అరెస్ట్
రిపబ్లిక్ హిందుస్థాన్, నేరడిగొండ : మండలం కేంద్రం లో సాయంత్రం ముక్కా శ్రీనివాస్ అనే వ్యాపారి దుకాణం పై సిసి ఎస్ బృందం జరిపిన ఆకస్మిక దాడిలో నిందితుడి వద్దా రూ.27 వేలు విలువ చేసే నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా 675 కిలోల బెల్లం, 770 కేజీల ఆలం కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం పట్టుబడిన నిషేధిత పదార్థాల విలువ మొత్తం రూ. 46 వేల వరకు ఉంటుందని సిసిఎస్ అధికారులు తెలిపారు. తదుపరి చర్యల కోసం నిందితుడిని నేరడిగొండ పోలీస్ స్టేషన్ కి అప్పగించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇచ్చోడా లో ఠాకూర్ ప్రతాప్...