ప్రియుడి కోసం... ప్రియురాలి ధర్నా...

🔶 పెళ్లి చేసుకోవాలని ప్రియుడి ఇంట్లో నిరసన 🔶 బాధితురాలికి న్యాయం చేయాలంటూ మహిళ సంఘాల డిమాండ్ రిపబ్లిక్ హిందుస్థాన్,ఇచ్చోడ : ఇద్దరూ గత తొమ్మిదేళ్లుగా ప్రేమించుకున్నారు. వాళ్లిద్దరిది ఒకే కులం. పైగా దగ్గరి బంధువులే. తొమ్మిదేళ్లుగా హైదరాబాద్లో చదువుకుంటున్నారు. అయితే అ అమ్మాయి ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుందామని కోరడం తో రేపుమాపు అంటూ తప్పించుకున్నాడు. చివరికి ముఖం చాటేయడంతో తమకు న్యాయం చేయాలని ఆ అమ్మాయి ప్రియుడి ఇంట్లోనే మంగళవారం రాత్రి ధర్నాకు దిగింది. ఇచ్చోడలోని టీచర్స్ కాలనీ చెందిన చందాల హరీశ్ కుమార్ మరియు నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మసాయిపేట్ గ్రామానికి చెందిన కుంటాల సుజాత గత తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు...