<em>అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య</em>
రిపబ్లిక్ హిందుస్థాన్, సిరికొండ : అప్పుల భాద భరించలేక పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిరికొండ మండలంలోని చీమన్ గుడి గ్రామం లో చోటుచేసుకుంది. సిరికొండ ఎస్సై పి నీరేష్ తెలిపిన వివరాల ప్రకారం సిరికొండ మండలం చీమన్ గూడి గ్రామానికి చెందిన జాదవ్ ప్రేమ్ (45) తనకు గల 2.8 ఎకరాల స్వంతా భూమితో పాటు మరో 7 ఎకరాల భూమిని కౌలు కు తీసుకోని వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఈ సంవత్సరం వర్షాకాలం లో కురిసిన భారీ వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతినడంతో పంట దిగుబడి రాలేదు. పంట దిగుబడి రాక, కుటుంబ పోషణ భారమై, పంట పెట్టుబడి కోసం...