కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలను సంక్షోభంలో నెట్టేస్తున్నారు….

రైతులను ఇబ్బంది పెడితే రైతులకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నా గిరిజన నాయకులు సేవాలాల్ బంజారా సంఘం మహిళా నాయకురాలు సక్రీ బాయి రిపబ్లిక్ హిందుస్థాన్ , హైదరాబాద్ : హైదరాబాద్ లో విలేకర్ల సమావేశంలో సేవాలాల్ బంజారా సంఘం మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సక్రీ బాయి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు వడ్లు అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్నారని , యాసంగి వరి వెయ్యదంటు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వడ్లు కోనబోమంటు వరి వెయ్యొదంటు సర్క్యులర్ ఇచ్చిందనీ కేసీఆర్ ప్రకటించారు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కోటి...