ఇచ్చోడలో విజృంభిస్తున్నా డెంగ్యూ..... డెంగ్యూ తో ఇద్దరి మృతి....
ఇచ్చోడలో భయపెడుతున్న డెంగ్యూ మరణాలు... వారం రోజులలోనే ఇద్దరు యువకుల మృతి.... వ్యాధులు ప్రబలుతున్నా పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు...... అభివృద్ధి పనులు , పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని వారం రోజుల క్రితమే ఆందోళన చేసిన కాలనీ ఇచ్చోడా వాసులు.... రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చోడా : ఇచ్చొడా మండల కేంద్రంలో డెంగ్యూతో ఇద్దరు యువకులు మృతి చెందారు. దింతో మండల వాసులు తీవ్ర భయాందోళన కు గురవుతున్నారు. ఇచ్చోడా పట్టణంలో పారిశుద్ధ్యం లోపించిడంతోనే ఇలా మరణాలు సంభవిస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ♦️ఇటీవల సుభాష్ నగర్ కాలనికి చెందిన యువకుడు డెంగ్యూ బారిన పడీ మృతి చెందాడు. ఈ ఘటన మరువక ముందే ,...