రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్ : అదిలాబాద్ జిల్లా రైతులకు నంద్యాల శెనగ 1 ( NBeg-3) రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త శ్రీధర్ చౌహన్ తెలిపారు. శనగ విత్తనాలు వందరోజుల కాలపరిమితితో ఎకరానికి 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడినిస్తాయని తెలిపారు. అదేవిధంగా ఈ విత్తన రకం కొంతవరకు వేడిని , బెట్ట ను తట్టుకుంటాయని తెలిపారు. విత్తనాలు కూడా మధ్యస్థ లావుగా ఉంటాయని తెలిపారు. ఎకరానికి 30 కిలోలకు విత్తుకోవాలని రైతులను సూచించారు. కిలో విత్తనాలు ధర వంద రూపాయలు ఉన్నట్లు తెలిపారు.
Thank you for reading this post, don't forget to subscribe!
ఈ సందర్భంగా విత్తన శుద్ధి చేసే విధానాన్ని వివరించారు. శనగ పంట వేసే సమయంలో రైతులు ఎండు తెగులు సమస్యను నివారించడానికి తప్పనిసరిగా విత్తనశుద్ది చేసుకోవాలని తెలిపారు. ప్రతి కిలో విత్తనాలకు 3 గ్రాముల థైరమ్/ కాపీటాన్ లేదా 2.5 గ్రాముల కార్బఇండిజమ్ లేదా 1.5 గ్రాముల విటావాక్స్ లను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలని అన్నారు.
విత్తనాలు కావాల్సిన రైతులు సీనియర్ శాస్త్రవేత్తలు డా శ్రీధర్ చౌహన్ ఫోన్ నెంబర్ 7337399461 , డా వి తిరుమల రావు – ఫోన్ నెంబర్ 90100 56667 , జి అనిల్ కుమార్ ఫోన్ నెంబర్ 9849402550 పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తల ఫోన్ నెంబర్లు ను సంప్రదించాలని అన్నారు.