republichindustan.in
Newspaper Banner
Date of Publish : 28 September 2024, 12:11 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

సౌదీలో ఘనంగా తెలుగు మాట..<br><br>తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న సౌదీ తెలుగు సమాజం

Hyderabad/Jeddah : ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ప్రవాసుల పట్ల భారత ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని రియాద్‌లోని భారత రాయబార కార్యాలయ ప్రథమ కార్యదర్శి మహమ్మద్ షరీక్ బదర్ అన్నారు.

రాజ్యంలో భారతీయ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలను ప్రారంభించిందని, విదేశాల్లోని ప్రవాస భారతీయులలో సుసంపన్నమైన భారతీయ సంస్కృతిని కాపాడేందుకు తన పూర్తి సహాయసహకారాలను అందజేస్తోందని ఆయన అన్నారు.

Thank you for reading this post, don't forget to subscribe!

తెలుగు దినోత్సవాన్ని ఉద్దేశించి షరీక్ బదర్ రాజ్యంలో శక్తివంతమైన తెలుగు సమాజాన్ని కొనియాడారు.

సౌదీ అరేబియాలోని తెలుగు ఎన్నారైల సామాజిక మరియు సాంస్కృతిక సంస్థ SATA (సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్) ద్వారా రియాద్‌లో జరిగిన తెలుగు ఎన్నారైల భారీ సమ్మేళన కార్యక్రమానికి సీనియర్ దౌత్యవేత్త ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సాటా ముఖ్యులు సెంట్రల్ ప్రెసిడెంట్ ఆనందరాజు నాయకత్వంలో, ముజ్జమ్మీల్, రంజీత్, ఆనంద్ పోకూరి, సత్తిబాబు, ఎర్రన్న, పవన్, ప్రశాంత్ లోకే, గోవిందరాజు, వంశీ, నాగార్జున, నరేంద్ర, సూర్య, వినయ, వెంకటేశ్, సుధీర్, జానీ శేఖ్, శ్రీకాంత్ లు,

మహిళల పక్షాన ప్రెసిడెంట్ సుచరిత నాయకత్వంలో సుధా, అక్షిత, అర్చన, భారతీ దాసరి, భారతి వీరపల్లి, శ్రీదేవి, సింధూర, శిల్పా, , పావని శర్మ, మాధవి గుంటి, లక్షి మాధవి, లక్ష్మి కాకిమని, గీతా శ్రీనివాస్, చందన తనకాల, రమ్య శ్రీ, ఉషా, చేతన శ్వేతలు కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లను చేపట్టారు.

అత్యధిక సంఖ్యలో మహిళలు మరియు పిల్లలతో సహా వందలాది మంది తెలుగు ఎన్నారైలను ఆకర్షించిన సంపూర్ణ పండుగ సందడి లో భారతీయ సంస్కృతి చైతన్యాన్ని చాటిచెప్పే అద్భుతమైన ప్రదర్శనతో రంగుల సాయంత్రం ప్రేక్షకులకు ప్రదర్శించారు.  భారతీయ సంప్రదాయంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే దేశభక్తి నాటకం ప్రేక్షకులను ఉద్వేగం కలిగించింది.

500 KM దూరం నుండి ఈస్ట్రన్ సాటా ప్రెసిడెంట్ తేజ ఆధ్వర్యంలో దాదాపు 50 కుటుంబాలు, 1400KM దూరం లో ఉన్న తాబుక్ నుండి రోహన్, హరిప్రియ, గున్నాజీ, రమీజ్ రాజా, 1000KM దూరం జెద్ద్ద నుండి నాగలక్ష్మి, అరుణా పాల్, నసీమా లు వివిధ మతాలకు చెందినా కలసి రావడం భిన్నత్వం లో ఏకత్వం సూచించిందని నిర్వాహకులు కొనియాడారు.

SATAలో రెండు రాష్ట్రాలకు చెందిన మహిళలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని, ఇటువంటి తెలుగు సమ్మేళనాలను వివిధ ప్రాంతాల్లో సంస్థ నిర్వహిస్తుందని సాటా వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేశం తెలియచేసారు.