republichindustan.in
Newspaper Banner
Date of Publish : 02 December 2021, 1:37 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

ఇచ్చోడలో మూడు వైన్స్ దుకాణాల్లో చోరీ…

ఉదయం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ….. రాత్రి దొంగలు రేకులు కట్ చేసి దోచేశారు…

Thank you for reading this post, don't forget to subscribe!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్రెండ్

  • మందు బాటిళ్లు , నగదు దోచుకెళ్లిన దొంగలు
  • నెలల వ్యవధిలోనే మరో దొంగతనం …
  • రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ (డిసెంబర్ 12 ): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. తాజాగా మండలంలోని అలెగామ ( కే) గ్రామ శివారంలో గల మూడు మద్యం దుకాణాల్లో గురువారం తెల్లవారు జామున దొంగలు చోరికి పాల్పడ్డారు . స్థానిక ఎస్ఐ ఉదయ్ కుమార్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి , కొత్తగా వెలసిన శ్రీ రాజ రాజేశ్వర , సిద్ధి వినాయక , లక్ష్మీ వైన్స్ల లో గుర్తు తెలియని దుండగులు వరుస చోరీలకు పాల్పడ్డారు . మూడు వైన్ షాపులా పై భాగంలో గల రేకులను ఒక పక్కకు తీసి లోపల చొరపడ్డారు . దొంగలు పక్క ప్రణాళిక ప్రకారం మద్యం , వాటిళ్లు , నగదును దోచుకెళ్లారు . మూడు మద్యం దుకాణాల్లో సుమారు రూ . 20 వేలు , రూ . పదిహేను వేల విలువ గల మద్యం బాటిళ్లు అపహరించారు . దొంగల మొఖాలు సీసీ కెమెరాలలో రొకార్డు కాకుండా వాటిని ధ్వంసం చేశారు . సీసీ కెమెరాలకు సంబంధించిన హర్డు డిస్కులు, సుమారు రూ . 30 వేల విలువ గల రెండు ఎల్ఈడీ టీవీలను దోనగలు ఎత్తుకెళ్లి పారిపోయారని తెలిపారు . వైన్స్ యజమానులు దొంగతనం గురించి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలాలను ఎస్సైలు ఉదయ్ కుమార్ , రాకేష్ లు పరిశీ లించారు . ఆదిలాబాద్ నుంచి క్లూస్ టీమ్ లను రప్పించి , వేలి ముద్రలను సేకరించారు . దుకాణాల యజమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని , దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.