ఉట్నూర్: ఆదివారం రోజున హైదరాబాదు నాంపల్లిలోని కమీషనర్ కాలేజీఎట్ విద్యాశాఖలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేయుచున్న అధ్యాపకులకు పదోన్నతి ప్రక్రియను నిర్వహించారు.
గుడిహత్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేయు చున్నా రాథోడ్ శ్రావణ్ కు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ప్రభుత్వ డిగ్రీ కళాశాల (సైన్స్) ఆదిలాబాదు యందు పదోన్నతి లభించింది. డిగ్రీ కాలేజీ కమీషనర్ శ్రీమతి దేవసేన ఐఏఎస్ గారు, ఆర్జేడీ బాలభాస్కర్ గారు
డి.సి.సి ప్రక్రియను పూర్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేయుచున్న 43 మంది అధ్యాపలకులలో 22 మంది అధ్యాపకులు పదోన్నతులు పొందారు ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల రాష్ట్ర అధ్యాపకల సంఘం నాయకులు డా. సురేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ , అసిస్టెంట్ ప్రొఫెసర్ కొమరా రెడ్డి , బాబురావు తదితరులు పాల్గొన్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!