republichindustan.in
Newspaper Banner
Date of Publish : 08 July 2022, 1:48 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

అత్యాచార నిందితునికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష

🔶 శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : స్నేహితుడి చెల్లెల్ని నమ్మించి మోసపూర్వకంగా అత్యాచారం చేసిన నిందితుడికి అత్యాచార నిందితునికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ  జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత తీర్పు వెలువరించారు.

  ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిట్టల వాడలో తన మిత్రుని చెల్లెల్ని రెండు సంవత్సరాల క్రితం నమ్మించి మోసం చేసి అత్యాచారం చేసిన పోయం ప్రశాంత్ అనే నిందితుడికి శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి  మంత్రి రామకృష్ణ సునీత   ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ.3000 ల జరిమానా U/Sec 376 IPC ( అత్యాచారం) కింద మరియు, U/Sec 417 (మోసం చేసిన) కింద ఒక సంవత్సరం కఠిన కారాగార జైలు శిక్ష ఏకకాలంలో విధిస్తూ తీర్పు వెలువరించారు.

*వివరాల్లోకి వెళితే*
కేసు పూర్వపరాల లో తేదీ 02/10/2016 రోజున  ఫిర్యాదుదారు రెండు సంవత్సరము లుగా  పూర్వం జరిగిన అత్యాచారం, మోసం పై  అదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని  పిట్టల వాడ కు సంబంధించిన
A1) పోయాం ప్రశాంత్
A2 ) పోయాం శంకర్
A3) పోయాం లక్ష్మి
A4)  తొడ్సం కౌసల్య లపై ఫిర్యాదు చేయగా, ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు దరఖాస్తు మేరకు cr no 352/2016, U/ Sec 324,294(b),417,376 r/w 34 IPC కింద నేరము పై కేసు నమోదు చేసి A1 పై అత్యాచారము మరియు మోసం చేసిన కేసు, A2,A3,A4 లపై A1 కు సహాయం చేసిన కేసు తో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం జరిగింది.

ఈ కేసును అప్పటి ఆదిలాబాద్ ఒకటో పట్టణ ఇన్స్పెక్టర్ ఎన్ సత్యనారాయణ విచారణ జరిపి ఇందులో భాగంగా 31 మంది సాక్షులను విచారించి నేరస్థులపై ఛార్జ్ షిటు దాఖలు చేసినారు. ఇట్టి కేసును గౌరవ మహిళా కోర్టు న్యాయమూర్తి  spl.no 18/2017 నమోదు చేసి విచారణ ప్రారంభించినారు. తదుపరి ఈ కేసును గౌరవనీయులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్ట్ నందు SC No 238/2017 గా నమోదు చేసి విచారణ జరిపినారు. విచారణలో భాగంగా ప్రాస్క్యూషన్ తరపున 21 మంది సాక్షులను ప్రవేశపెట్టి విచారించినారు. ఈ కేసును అడిషనల్ పీపీ సంజయ్ కుమార్ వైరాగరి ప్రాసిక్యూషన్ తరపున సాక్షులకు ప్రవేశపెట్టి శిక్షపడేలా వాదించగా ఆయనకు కోర్ట్ లైసెన్ అధికారి ఎం గంగా సింగ్, కోర్టు డ్యూటీ అధికారులు అశోక్, రవీందర్ సింగ్ లు సాక్షలను ప్రవేశపెట్టడంలో విచారణకు సహకరించినారు.

ఇరుపక్షాల వాదనలు విన్న గౌరవ ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత ఈ రోజున ప్రధాన  నిందితుడగు పోయం ప్రశాంత్ పై నేరం రుజువు అయినందున ఏడు సంవత్సరముల కఠిన కారాగార శిక్ష మరియు రూ 3000/- జరిమానా విధించడం జరిగింది. ఇతర నిందితులపై నేరం రుజువు కానందున వారిని విడిచిపెట్టడం జరిగిందని తెలిపారు. పి పి సంజయ్ కుమార్ వైరాగరని, కోర్టు లైసెన్ధికారి గంగా సింగ్, కోర్టు డ్యూటీ అధికారులు అశోక్, రవీందర్ సింగ్ లకు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.