republichindustan.in
Newspaper Banner
Date of Publish : 15 June 2022, 3:09 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

సామజిక మధ్యమాల్లో ఇతరులను కించపరిచే పోస్టులు పెట్టొద్దు : సిఐ

—  ఇతర మతాల పై కించపరిచే విధంగా పోస్టులు పెట్టిన ఇద్దరి అరెస్ట్

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :   మంగళవారం రోజు ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు షేక్ అస్లాం మరియు మేష్రం రమేష్ అనే ఇద్దరు వ్యక్తులు ఫేస్బుక్ లో ఇతర మతాలను కించ పరిచే విధంగా పోస్టులు చేయటం జరిగిందని ఇచ్చోడా సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రమేష్ బాబు తెలిపారు. ఇట్టి విషయంపై రెండు కేసులు నమోదు చేసి వెంటనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ చేయటం జరిగిందని తెలిపారు. ఈ సందర్బంగా  ఎవరు కూడా ఇతరులను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవటం జరగుతుందని ప్రజలకు తెలియజేశారు. అందరూ సంయమనం పాటించాలని అన్నారు.