republichindustan.in
Newspaper Banner
Date of Publish : 03 February 2024, 2:32 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

బీజేపీలో చేరిన నర్సంపేట నియోజకవర్గ యువ నేత రాణాప్రతాప్ రెడ్డి మరియు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ..

బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆధ్వర్యంలో, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షలో చేరికలు
నర్సంపేటలో బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బతగిలింది.బీఆర్ఎస్ పార్టీకి చెందిన యువ నాయకుడు రాణా ప్రతాపరెడ్డి ఆ పార్టీకి, కన్వీనర్ పదవికి రాజీనామా చేశారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ పై సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన పరిణామాలతో పార్టీకి రాజీనామా చేశారు.

Thank you for reading this post, don't forget to subscribe!

రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరుతున్న బీఆర్ఎస్ నాయకులు

వారంతా శనివారం బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆధ్వర్యంలో , రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వీరితో పాటు నియోజవర్గ చెందిన పలువురు నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ లో చేరినవారిలో గోగుల రాణా ప్రతాప్ రెడ్డి , ఏడో డివిజన్ కౌన్సిలర్ మినుముల రాజు, నాల్గో డివిజన్ కౌన్సిలర్ శీలం రాంబాబు, రెండో డివిజన్ కౌన్సిలర్ జుర్రు రాజు, మూడో డివిజన్ కౌన్సిలర్ బానవత్ కవిత-వీరన్న, 17వ డివిజన్ కౌన్సిలర్ బోడ గోల్యా నాయక్, తదితరులు వీరితో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు బీజేపీ లో చేరారు.