Thank you for reading this post, don't forget to subscribe!
ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి సుభాష్ రాథోడ్
రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చోడా :
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి సుభాష్ రాథోడ్ అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని కేశవపట్నం గ్రామంలో గ్రామ పెద్దలతో కలిసి అభివృద్ధి కోసం ఓటు వేయాలని తెలిపారు. అదేవిధంగా గతంలో గెలిచిన నాయకులు ఇప్పుడు మళ్ళీ పోటీలో ఉన్నారని వారి వల్ల ఎలాంటి అభివృద్ధి జరగదని మనకు తెలుసనీ అన్నారు. పార్టీల గురించి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఈ ఒక్కసారి తన కు అవకాశం ఇవ్వాలని అన్నారు. గత 45 ఏళ్లుగా అధికారంలో ఉండి ఎమి చేయనోళ్లు ఇప్పుడు మళ్ళీ గెలిచి ఎం చేయలేరని అన్నారు. ఈ సందర్బంగా గ్రామస్తులు ఒక్కసారి ఇచ్చోడా మండల నాయకుడికి కూడా అవకాశం ఇస్తామని, మా మద్దత్తు మీకే అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జావుల్, ముజాహిద్, ఇర్ఫాన్, వసీం, నసీం, జావిద్ , హర్షద్ , జాసిన్
శ్యాముల్ లు పాల్గొన్నారు.
political news subash rathod mp candidate Adilabad Parliament independent
