republichindustan.in
Newspaper Banner
Date of Publish : 23 May 2022, 5:24 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

మా కుటుంబ భూ వివాదంలో ఎమ్మెల్యే ను లాగొద్దు

— నాకు తెరస పార్టీకి ఎలాంటి సంబంధం లేదు
— నేను తెరస కార్యకర్తను కాను
— ఎండి యాకుబ్

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :

ఓ ఆర్మీ జవాన్ తన స్థలాన్ని తెరస నాయకుడు ఎమ్మెల్యే అనుచరుడు కబ్జా చేసిండని సదరు ఆర్మీ జవాన్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. అయితే ఆర్మీ జవాన్ ఎమ్మెల్యే అనుచరుడు గ పేర్కొంటున్న ఎదుటి వ్యక్తి అయినా ఎం డి యాకుబ్ తనకు ఎమ్మెల్యే రాథోడ్ ఎలాంటి సంబంధం లేదని, నేను తెరస పార్టీలో లేనని ఓ ప్రకటనలో తెలిపాడు. ఇప్పటి వరకు కనీసం తెరాస పార్టీ సభ్యత్వం కూడా తీసుకోలేదని అన్నాడు. అలాంటప్పుడు నేను ఎమ్మెల్యే అనుచరుడిని ఎలా అవుతానని ప్రశ్నించాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తమ కుటుంబ వ్యవహారాన్ని ఎమ్మెల్యే కు అంటగట్టి రాజకీయం చేస్తుందని ఆరోపించాడు. తమ కుటుంబ భూ వివాదం లో ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ పేరును లాగొద్దని కోరారు. ఇలా చేసి కావాలని దృష్టి పడేలా చేస్తున్నారని అన్నాడు.