republichindustan.in
Newspaper Banner
Date of Publish : 19 October 2022, 9:36 am Digital Edition : REPUBLIC HINDUSTAN

పోలీసుల రక్తదాన శిబిరానికి విశేష స్పందన

◾️పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా స్వచ్ఛందంగా రక్తదానం చేసిన 280 మంది పోలీసులు, ప్రజలు

◾️స్వయంగా రక్తదానం చేసి సిబ్బందికి ఆదర్శంగా నిలిచిన జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి

◾️ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తం అవసరం ఎక్కువ

◾️భారీ ఎత్తున పాల్గొన్న స్థానిక యువకులు, ప్రజా నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
రానున్న అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా బుధవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరానికి జిల్లా ఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం అమరవీరుల స్తూపం చిత్రపటం వద్ద జ్యోతిని వెలిగించి అమరవీరులకు పూలతో నివాళులర్పించారు. జిల్లా పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి స్వయంగా జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి రక్తదానం చేసి సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో నుండి పోలీస్ సిబ్బంది మరియు ప్రజలు, ముఖ్యంగా ఆదిలాబాద్ పట్టణంలోని వివిధ వార్డులకు సంబంధించిన ప్రజలు ఉద్యోగులు 280 మంది పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తల సేమియా వ్యాధిగ్రస్తుల కు రక్తం అవసరం ఎక్కువగా ఉన్నందున ఇలాంటి రక్తదాన శిబిరాల్లో ప్రజలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం శుభ పరిణామం అని తెలియజేశారు.

రక్త దానం చేసిన వారు ప్రాణదాతలతో సమానమని కొనియాడారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జిల్లా ఎస్పీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు, ముఖ్యంగా వికలాంగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనడం విశేషం. ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడానికి ఎంతగానో సహకరించిన రిమ్స్ వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరికి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ లు ఎస్ శ్రీనివాసరావు, సి సమయ్ జాన్ రావు, ఉట్నూర్ ఎ ఎస్.పి హర్షవర్ధన్, డి.ఎస్.పి వి ఉమేందర్, మెడికల్ అధికారి రిమ్స్ డాక్టర్ రాజ్యలక్ష్మి, సిఐలు పి సురేందర్, బి రఘుపతి, కే శ్రీధర్, కే మల్లేష్, కే నరేష్ కుమార్, ఈ చంద్రమౌళి, జె కృష్ణమూర్తి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, బి శ్రీ పాల్, ఎం వంశీకృష్ణ, రిమ్స్ సిబ్బంది స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్స్, డాక్టర్స్ తదితరులు పాల్గొన్నారు.