అమరావతి :
ఏపీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. జనవరి 16వ తేదీన శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని పర్యటించనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన లేపాక్షిని ప్రధాని నరేంద్రమోడీ పర్యటించనున్నారు..
పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్‌ను సందర్శించనున్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!
అనంతరం జరిగే సభలో పాల్గొననున్నారు. ప్రధాని పర్యటనకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎస్ జవహర్ రెడ్డి శనివారం అధికారులతో సమీక్షించారు.
ప్రధాని పర్యటనలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ కూడా పాల్గొనే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ప్రధాని పర్యటనకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని డీజీపీని ఆదేశించారు..