republichindustan.in
Newspaper Banner
Date of Publish : 20 January 2024, 2:09 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

తమిళనాడు ముఖ్యమంత్రిని అపాయము నుండి కాపాడిన నరేంద్ర మోడీ

తమిళనాడు : ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ వేదికపై శనివారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

ప్రధాని మోడీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్టేజ్ పైకి నడుస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎంకే స్టాలిన్ కాలు స్లిప్ అయి కింద పడిపోబోయాడు.

అప్రమత్తమైన ప్రధాని నరేంద్ర మోడీ సీఎం స్టాలిన్ చేయి పట్టుకుని కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది…