రిపబ్లిక్ హిందుస్థాన్, గుడిహత్నూర్:
Thank you for reading this post, don't forget to subscribe!
మండలంలో కేంద్రంలో చౌక ధరల దుకాణంలో ప్లాస్టిక్ బియ్యాన్ని పోలిన బియ్యం పంపిణి జరగడంతో ఈరోజు విషయం స్థానికంగా కలకలం రేపింది. మండలం లోని కోలాం గూడా, మచ్చపూర్ గ్రామస్తులు రేషన్ షాప్ నుండి తీసుకెళ్లిన బియ్యం లో తెల్లగా మిక్స్ ఉన్న బియ్యం లాంటివి కనిపించడం తో ప్లాస్టిక్ బియ్యం వచ్చిందేమో అని ఆదివాసీ గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.

( ఇదే బియ్యాన్ని గ్రామస్తులు ప్లాస్టిక్ బియ్యంగ పేర్కొంటున్నారు )
సామాజిక మధ్యమాల్లో అప్పుడప్పుడు ప్లాస్టిక్ బియ్యం పై వీడియో లు చూసే జనం ఇది ప్లాస్టిక్ బియ్యంమెమో అని భయపడుతున్నారు.
ఏదేమైనా అధికారులు దీని పై దృష్టి సారించి అవి ప్లాస్టిక్ బియ్యమా? లేదా సాధారణ బియ్యమా?అనేది నిర్ధారణ చేసి లబ్ధిదారుల అనుమానాన్ని నివృత్తి చేయాలనీ కోరుకుందాం..

