రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడా : మండలంలోని జున్ని గ్రామంలో ఓ వ్యక్తి జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. ఇచ్చోడా ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం…. మండలంలోని జున్ని గ్రామానికి చెందిన రాజపంకి విష్ణు( 51) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ముగ్గురు కొడుకులు వేరేప్రాంతం లో ఉంటున్నారు. విష్ణు అతని భార్య రాజ్ పంకే ఛాయా బాయి ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. అయితే విష్ణు కు 6 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ కావడంతో ప్రమాదానికి గురయ్యాడు. అప్పటి నుండి ఆరోగ్యం సహకరించక పోవడంతో మద్యానికి బానిసయ్యాడు. ఆరోగ్యం సహకరించక బాధలు అనుభవిస్తున్న విష్ణు బుధవారం రోజు ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లో ఉన్న క్లియర్ అనే గడ్డి మందు తాగి పడిపోవడంతో, నోటి నుండి పురుగుల మందు వాసనా రావడం గమనించిన మృతుని భార్య చుట్టుపక్కల వారిని పిలవడంతో చికిత్స కోసం హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ గురువారం రోజు మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Thank you for reading this post, don't forget to subscribe!