republichindustan.in
Newspaper Banner
Date of Publish : 24 January 2024, 12:54 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

Crime News: గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

పెద్దపల్లి జిల్లా:జనవరి 24
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని దురాశతో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని పెద్దపల్లి పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు.

నిందితుడి వద్ద నుంచి గంజాయి చాక్లెట్స్ స్వాధీనం చేసుకొన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎస్‌ఐ మల్లేష్‌ మీడియాకు విరాలను వెల్లడించారు. పెద్దపెల్లి పట్టణానికి చెందిన అన్సారీ అనే వ్యక్తి కష్టపడకుండా డబ్బులు సంపాందించాలని తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు.

ఇందుకోసం కాలేజీలు ఎక్కువగా ఉన్న ఏరియాలను టార్గెట్‌గా చేసుకొని ఉత్తరప్రదేశ్ నుంచి గంజాయి చాక్లెట్స్‌ తెప్పించి విక్రయిస్తున్నాడని తెలిపారు.

విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం పట్టణంలోని అమర్ నగర్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు…