🔴 ముగ్గురు నిందితుల అరెస్ట్, ఆదిలాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు, మూడు ఆటోలు సీజ్ చేసిన స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి
Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అంతం అందించే దిశగా జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి ఆధ్వర్యంలోని బృందం పనిచేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ చిందం దేవిదాస్ కు వచ్చిన సమాచారం మేరకు, ఈరోజు సాయంత్రం ఆదిలాబాద్ నుండి బోరి గ్రామం మహారాష్ట్రకు 21 క్వింటల్లా రాయితీ బియ్యం మూడు ఆటోలలో తరలిస్తున్న ముగ్గురు నిందితులను చాందా గ్రామ శివారు నందు చాకచక్యంగా పట్టుకోవడం జరిగిందని స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. పట్టుబడిన నిందితుల వివరాలు
1) ఎస్ కే వసీం తాటి గూడ చెందిన వ్యక్తి.
2) సోహిబ్ ఖాన్ శాంతినగర్ కు చెందిన వ్యక్తి.
3) మొయి అలీ కెఆర్కె కాలనీకి చెందిన వ్యక్తి.
ఈ ముగ్గురు మూడు ఆటోలలో 7 క్వింటల్లా చొప్పున మొత్తం 21 క్వింటాళ్ల ప్రభుత్వ రాయితీ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్నారని, వీరిపై ఆదిలాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయబడినదిని తెలిపారు. స్వాధీనం చేసుకున్న 21 క్వింటల రాయితీ బియ్యాన్ని పౌరసరఫలాల అధికారికి అందజేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలను సహించేది లేదని, జిల్లా ప్రజలు ఎటువంటి సమాచారం అయినా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి 9490619548 నెంబర్కు ఫోన్ చేసి తెలుపవచ్చని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఈ ఆపరేషన్ నందు స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ రుక్మారెడ్డి సిబ్బంది జె సురేష్ చిందం దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు.