republichindustan.in
Newspaper Banner
Date of Publish : 30 January 2024, 6:46 am Digital Edition : REPUBLIC HINDUSTAN

19 మంది పాకిస్తాన్‌ నావికుల కిడ్నాప్: కాపాడిన భారత్ నేవీ

పాకిస్తాన్ కు చెందిన 19 మంది నావికులను భారత సైన్యం కాపాడింది. ఈ విషయాన్ని భారత నావికాదళం అధికారికంగా ప్రకటించింది. సోమాలియా తూర్పు తీరంలో సముద్రపు దొంగలు పాకిస్తాన్ కు చెందిన చేపల వేట నౌకను హైజాక్ చేశారు.

Thank you for reading this post, don't forget to subscribe!

దీంతో భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ పాకిస్తాన్ కు చెందిన నావికులను రక్షించింది. 36 గంటల్లో యుద్దనౌక జరిపిన రెండో యాంటీ పైరసీ ఆపరేషన్ అని భారత నావికాదళం ప్రకటించింది.

ఇరాన్ జెండాతో కూడిన ఫిషింగ్ ఓడ ఎఫ్‌వీలో ఆల్ నయీమిలో 11 మంది సాయుధ సముద్రపు దొంగలు ఎక్కారు. ఈ ఓడలోని 19 మంది పాకిస్తానీలను బందీలుగా పట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్ర ఓడను అడ్డగించింది. బందీలను విడిపించింది.

36 గంటల వ్యవధిలో కొచ్చికి దాదాపు 850 ఎన్ఎమ్ పశ్చిమాన అరేబియా సముద్రంలో 36 మంది సిబ్బంది, 17 మంది ఇరానియన్, 19 మంది పాకిస్తాన్ లను హైజాక్ చేసిన రెండు ఫిషింగ్ ఓడలను ఐఎన్ఎస్ సుమిత్ర రక్షించింది.

ఓడలోని సిబ్బందిని రక్షించేందుకు భారత నావికాదళానికి చెందిన మెరైన్ కమాండ్ లో ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. భారత నౌక దళానికి చెందిన యుద్దనౌకలు హిందూ మహాసముద్రం ప్రాంతంలో మోహరించాయి. ఈ ప్రాంతంలో భద్రతను కల్పించాయని రక్షణశాఖాధికారులు వివరించారు.

హైజాక్ చేసిన ఓడను, సిబ్బందిని సురక్షితంగా విడుదలయ్యారని భారత నావికాదళం అధికారి మీడియాకు తెలిపారు.హైజాక్ చేసిన ఓడను దుండగలు సోమాలియా వైపునకు తరలించే ప్రయత్నించారు. ఈ విషయం తెలిసిన ఐఎన్ఎస్ సుమిత్ర యుద్ధనౌక హైజాక్ కు గురైన ఓడను చుట్టిముట్టి కిడ్నాప్ నకు గురైన వారిని కాపాడినట్టుగా నావికాదళం తెలిపింది.

డికోవిటా ఫిషింగ్ హార్బర్ నుండి మల్టీ డే ఫిషింగ్ ట్రాలర్ లోరెంజోవుతా-4సెట్ తో సముద్రం దొంగలు ఆరుగురు శ్రీలంక మత్స్యకారులను పట్టుకున్న
పది రోజుల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. యెమెన్ లో ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన క్షిపణి డీకొట్టడంతో శుక్రవారం నాడు బ్రిటిష్ ఆయిల్ ట్యాంకర్ ఎంవీ మెర్లిన్ లువాండా నుండి అత్యవసర సహాయం కోసం సమాచారం రావడంతో భారత నావికాదళం స్పందించింది. ఐఎన్ఎస్ విశాఖపట్టణానికి చెందిన గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ స్పందించింది.