republichindustan.in
Newspaper Banner
Date of Publish : 18 July 2025, 9:55 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

లయన్ ఫిట్నెస్ జిమ్ లో డ్రగ్స్ , స్టెరాయిడ్స్ స్వాధీనం – జిమ్ సీజ్ <br><br>

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఐపిఎస్  ఆదేశాల మేరకు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలియజేశారు. గురువారం ఆదిలాబాద్ పట్టణం లోని నడిబొడ్డున వినాయక చౌక్ ప్రాంతం నందు లయన్ జిమ్ నిర్వాహకుడు మరియు నిందితుడు అయిన షేక్ ఆదిల్ చట్ట వ్యతిరేకంగా డ్రగ్సును తీసుకుంటూ మరియు స్టెరాయిడ్స్ ను జిమ్కు వచ్చే వారికి అందజేస్తున్నానే అభియోగం తో నిన్న 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. గురువారం జిమ్ పై విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా సంఘటన స్థలంలో 20 ఎంఎల్ ఏఎంపి ఇంజక్షన్ బాటిల్, మూడు ఇంజక్షన్లు, 36 స్టెరాయిడ్స్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. సర్జరీకి వాడే డ్రగ్ 3 ఇంజెక్షన్లు లభ్యం, స్టెరాయిడ్ టాబ్లెట్లను జిమ్ కు వచ్చే వారికి అందజేసి వారి అనారోగ్యాల బారిన పడే విధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు అతనిపై ఆదిలాబాద్ ఒకటో ఒకటైన పోలీస్ స్టేషన్లో 334/25 అండర్ సెక్షన్ 125 BNS 27 (B)(ii) DCA act తో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. చట్ట వ్యతిరేకంగా వ్యాపారస్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎడల వారి ట్రేడ్ లైసెన్స్ ను రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు.

Thank you for reading this post, don't forget to subscribe!

జిమ్ ను సీజ్ చేస్తున్న అధికారులు

ఈ సంఘటన నందు ఆర్డిఓ కి జిమ్ సీజ్ చేయడం కోసం సిఫార్సు చేయగా ఆర్డీవో అనుమతితో ఈరోజు రెవెన్యూ మున్సిపాలిటీ పోలీస్ అధికారుల సమక్షంలో లయన్ జిమ్మును సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిమ్ నిర్వాహకులు ఇచ్చే ఎలాంటి టాబ్లెట్లను ఇంజక్షన్లను వాడకుండా పూర్తి అవగాహనతో ఉండాలని సూచించారు. వ్యాపారాలలో అసాంఘిక కార్యకలాపాలు చేసే వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాసరావు, మున్సిపల్  అధికారులు, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.