republichindustan.in
Newspaper Banner
Date of Publish : 01 June 2025, 3:32 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

ADB: ఆవు దూడను చంపిన కేసులో నిందితుడు అరెస్ట్

ఆదిలాబాద్ డిఎస్పీ జీవన్ రెడ్డి, జైనథ్ సిఐ డి.సాయినాథ్

Thank you for reading this post, don't forget to subscribe!

  • కత్తితో ఆవు దూడను చంపి, అటవీ జంతువుల మాంసంగా అమ్మే ప్రయత్నం చేయాలనుకున్న నిందితుడు.
  • నిందితుడిపై ఇదివరకే  దొంగతనం కేసులు, ఫారెస్ట్ కేసులు, సస్పెక్ట్ షీట్ నమోదు.
  • గోవద నిషేధం, ఆవులను చంపినా చట్టరీత్యా కఠిన చర్యలు.
  • ప్రస్తుతం రౌడీ షీట్ ఓపెన్

    👉 చాకచక్యంగా నిందితులను పట్టుకున్న జైనథ్ సిఐ మరియు ఎస్సై లను అభినందించిన జిల్లా ఎస్పీ

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్: శనివారం గిమ్మ గ్రామ శివారు ప్రాంతంలో ఆవు దూడను కత్తితో పొడిచి ప్రాణాపాయ స్థితిలో ఉన్నదని సమాచారం తెలిసిన వెంటనే జైనథ్ సిఐ డి సాయినాథ్, ఎస్సై లు వెటర్నరీ డాక్టర్ తో కలిసి సంఘటన స్థలానికి వెళ్లగా, అక్కడ కొన ఊపిరితో ఉన్న దూడను బ్రతికించే ప్రయత్నం చేసినారు. కత్తితో ఆవు దూడను పొడిచిన కారణంగా కొద్దిసేపటికి ఆవు దూడ ప్రాణాలను విడిచింది. ఈ సంఘటన నందు జైనథ్ సీఐ మరియు ఎస్ఐ గౌతమ్ లు విచారణ చేపట్టగా ఆవు దూడ సిరిసన్న గ్రామానికి చెందిన సాయికుమార్ ది అని తేలినది, బాధితుడు ఆవు దూడను పరిశీలించి తనదే అని ధ్రువీకరించారు. ఆవు ను చంపడానికి ఉపయోగించిన ఆయుధం వేటకు ఉపయోగించే బల్లెం లా ఉందని దాని అధారంగా విచారణ ప్రారంభించిన జైనథ్ సిఐ, గిమ్మ గ్రామం కి చెందిన వ్యక్తి *రాథోడ్ సంజయ్* మీద అనుమానంతో అతనిని ఈ రోజు అదుపులోకి విచారణ చేయగా అతను నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది అని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. నిందితుడు గిమ్మ గ్రామానికి చెందిన వ్యక్తి ఇతనిపై ఇదివరకే మేకలు దొంగతనం చేసిన కేసు, గుడిలో దొంగతనం చేసిన కేసు, ఫారెస్ట్ కేసులు నమోదు అయి ఉన్న విషయాన్ని తెలిపారు. ఇతను ఇలా చంపిన ఆవు దూడను అటవీ జంతువుల మాంసంగా విక్రయించే ప్రయత్నం చేస్తాడని విచారణలో తేలింది అని తెలిపారు. ఇతనిపై జైనథ్ పోలీస్ స్టేషన్ నందు 135 క్రైమ్ నెంబర్ తో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఇట్టి కేసు నందు నేరస్తుని పట్టుకోవడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జైనథ్ సిఐ మరియు ఎస్ఐలను  జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ ఐపిఎస్ అభినందించారు. ఆవులను చంపిన, అక్రమం గా రవాణా చేసిన, అక్రమంగా అమ్మిన చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుందని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఉల్లంఘించిన వారిపై సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయబడతాయని హెచ్చరించారు.