రిపబ్లిక్ హిందుస్థాన్, గాదిగుడా :
అదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం లో డి ఆర్ డి ఎ ఐకేపీ కమ్యూనిటీ కోఆర్డినేటర్ గా విధులు నిర్వహిస్తున్న కనక మారుతి అనే సిసి పలు రకాల వ్యాధులతో గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యానికి గురి అయి బాధపడుతూ ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న పిడి డిఆర్డిఓ ఎస్ కిషన్, ఏపీడి అర్కా చరనదాస్, హెచ్ఆర్ ఏపీఎం తుమ్మల వార్ శ్రీనివాస్, అదిలాబాద్ ఏపిఎం జిల్లా జేఏసీ అధ్యక్షులు సోన్ కాంబ్లీ శుద్ధోధన్, మావల ఏపీఎం గడ్డం రాజు చంద్రశేఖర్ ఆదివారం మరణించిన సిసి కనుక మారుతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వపరంగా అంతిమ దహన సంస్కారాల కోసం అందించవలసిన రూ 20 వేలు రూపాయలను వారి యొక్క కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు డిఆర్డిఏ స్టాప్ తదితరులు పాల్గొన్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!