republichindustan.in
Newspaper Banner
Date of Publish : 23 September 2025, 7:01 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం

*కొణిజర్ల ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ  నందు ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం*

హైదరాబాద్ : సెప్టెంబర్ 23న కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆయుర్వేదిక దినోత్సవం గా ప్రకటించడం జరిగింది. కావున ఈ రోజు జాతీయ ఆయుర్వేద దినోత్సవం పురస్కరించుకొని కొనిజర్ల  ఆయుర్వేద హస్పటల్ లోని ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ నందు ఘనంగా ఆయుర్వేద దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యోగా ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆయుర్వేదం కొన్ని వేల సంవత్సరాల నుండి అన్ని రకాల వ్యాధులకు సర్వరోగ నివారిణి గా మన నిత్య జీవితంలో వాడుతూ ఉన్నాం. పసుపుని యాంటీబయటక ఉప్పు వేప తులసి లాంటి అనేక ఔషధ గుణాలున్న మన నిత్యజీవితంలో వాడుతూ ఉన్నాం. కావున కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఆయుర్వేదిక్ దినోత్సవ తీమ్ ప్రజలు గ్రహాల కోసం ఆయుర్వేదం. ప్రతి వంటిల్లు కూడా ఒక ఆయుర్వేదిక వైద్యశాలగా పేరుగాంచిన సనాతన భారతదేశ కుటుంబ వ్యవస్థలో మనం జీవించి ఉన్నాం మారుతున్న తరుణంలో మనం ఆయుర్వేదాన్ని నిర్లక్ష్యం చేసాము. కానీ కరోనా తర్వాత మరల ఆయుర్వేద యొక్క పునరువైభవం భారతదేశంలో వ్యాపించింది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు.

Thank you for reading this post, don't forget to subscribe!

ఈ కార్యక్రమంలో ధన్వంతరి మహర్షికి పూలమాల సమర్పించి,పూజా కార్యక్రమం నిర్వహించి అందరికీ తులసి తీర్థము, పండ్లు, ఆయుర్వేదిక్ మందులు. పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ శారదగారు,సిహెచ్ఓ దుర్గా మల్లీశ్వరిగారు. ఆయుర్వేదిక్ డాక్టర్ శ్రీలేఖ,స్టాఫ్ నర్స్ రజిని,ఫార్మసిస్టు కల్పన, యోగా ఇన్స్పెక్టర్ సంధ్యారాణి నాగేశ్వరరావు మరియు ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.