అరెల్లి మల్లేష్ మాదిగ
ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్..
రిపబ్లిక్ హిందుస్థాన్, రిమ్స్ (అదిలాబాద్) :
ఈనెల 3న ఇచ్చోడ మండలం తలమద్రి గ్రామానికి చెందిన ఎస్సి మదిగ కులానికి చెందిన గసికంటి పెద్ద రాజన్న, గంగయ్య, లక్ష్మన్, అనే ఇద్దరు మధ్యాహ్నం వారి చేనులో వ్యవసాయ పనుల్లో భాగంగా భూమిని చదును చేసుకుంటున్న క్రమంలో.. అదే గ్రామానికి చెందిన కొంతమంది మారణాయుధాలతో, గొండ్డన్లు లతో కర్రలతో, రాళ్లతో విపరీతంగా దాడి చేయడం వల్ల తలలు పగిలి పలుచోట్ల బలమైన దెబ్బలు తగిలి, రిమ్స్ ఆసుపత్రి ఆదిలాబాద్ లో చేరడం జరిగిందని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ అరెల్లి మల్లేష్ మాదిగ ఒక ప్రకటనలో తెలిపారు.
… బాధితులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లిపోయారు ఫిర్యాదు చేసినప్పటికీ.. పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కేసును తప్పుదోవ వట్టించే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టకుండా దోషులను కాపాడే విధంగా ఎస్ఐ, సీఐ ప్రవర్తన ఉందని ఆరోపించారు.. గతంలో కూడా అధికారుల ప్రవర్తన ఇదేవిధంగా ఉందని అన్నారు. మాదిగల పైన జరిగిన దాడులకు పలు కేసులను నిర్వీర్యం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయని అన్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!
తక్షణమే జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి ఇచ్చోడలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ, సీఐ నీ సస్పెండ్ చేయాల్సిందిగా ఎమ్మార్పీఎస్ తరుపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు . లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా కో కన్వీనర్ గైక్వాడ్ సూర్యకాంత్ మాదిగ, గాసికంటి లక్ష్మన్ మాదిగ, శ్రీను మాదిగ ఆనంద్ మాదిగ, సత్యనారాయణ మాదిగ తదితరులు పాల్గొన్నారు..
