— జిల్లా పాలనాధికారి రాజర్షి షా
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ కలెక్టరేట్ :
తెలంగాణ బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం ఈ నెల 28 న అదిలాబాద్ కు రానున్న సందర్భంగా సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని శనివారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు.
Thank you for reading this post, don't forget to subscribe!

అదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ , మంచిర్యాల ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ నెల 28 న అదిలాబాద్ లోని జడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలో సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మి, బీ.సీ వెల్ఫేర్ కమిషనర్ల తో కూడిన బృందం ప్రజాభిప్రాయ సేకరణ జరుపనుందని , ఈ నేపథ్యం లో ప్రజావాణి రద్దు చేయడం జరిగిందని, ప్రజలు దీనిని గమనించి సోమవారం కలెక్టరేట్ కు రావద్దని జిల్లా పాలనాధికారి ఆ ప్రకటన లో తెలిపారు.