— ఆదివాసి సేన కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆధ్యక్షులు కోట్నక్ గణపతి
Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందూస్థాన్,తిర్యాని: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి పెందోర్ పుష్ప రాణికి ఆదిలాబాద్ సేన సంపూర్ణ మద్దతు తెలుపుతుందని. ఆదివాసి సేన కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆధ్యక్షులు కోట్నక్ గణపతి విలేకరుల సమావేశంలో తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆదివాసి లకు ఎమ్మెల్సీ, రాజ్యసభ సీటును ఎ రాజకీయ పార్టీ కేటాయించలేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసి సేన అభిమాన ఎంపిటిసిలు, జడ్పీటీసీ లు, మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు ప్రతి పక్ష పార్టీలు ఆదివాసి సమాజం తరుపున పేందూర్ పుష్పరాణికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి సేన కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆధ్యక్షులు కోట్నక్ గణపతి, ఆదివాసి సేన నాయకులు రాయిసిడం శంకర్, టేకం మారుతీరావు, చిక్రం కిషన్ రావు, రాయిసిడం భూంరావు,టేకం సాగర్, తదితరులు పాల్గొన్నారు.