Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : జామిడి గ్రామాన్ని అన్ని విధాలుగా, అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు అన్నారు. ఆదివారం రోజు గ్రామంలో స్మశానవాటిక ప్రారంభోత్సవాన్ని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జామిడి గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. గ్రామానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామానికి
ధ్యానమందిర్ ను మంజూరు చేస్తానని అన్నారు.
గ్రామం లో ఓ వ్యక్తి చనిపోవడం తో అనాధ అయినా కుటుంబాన్ని పరామర్శించారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన నలుగురు చిన్నారుల చూసిన ఎమ్మెల్యే కేటీఆర్ తో మాట్లాడి అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని అదుకుంటానని అన్నారు.




అనంతరం నూతన సిసి రోడ్డు పనులకు స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం గ్రామంలోని అప్పుడు రిపేర్ చేసినటువంటి అంగన్వాడి కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి ప్రితం రెడ్డి, మాజీ ఎంపిపి డుక్రె, మాజీ పిఏసిఎస్ వైస్ చైర్మన్ హారన్ మారుతి, సర్పంచ్ సుభాష్, గెర్జామ్ ఉప సర్పంచ్ బలగం రవి, వార్డ్ మెంబెర్లు నర్వడే మిలింద్, వటంబె లక్ష్మి బాయి మరియు బాంబరఖేడే గోవింద్ రావ్, రాథోడ్ సుభాష్, పాన్పాట్టే సుభాష్ లు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గొప్ప మనసు
జామిడి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే హారన్ మారుతి పటేల్ అనే కార్యకర్త ఇంటికి ఆహ్వానించడంతో కాదనకుండా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్న వారి ఇంటికి వెళ్లారు. దింతో ఆ కుటుంబం సంతోషానికి హద్దులేకుండా పోయింది.