రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం రోజున ఇచ్చోడ మండలములోని మాదాపూర్ గ్రామంలో ఓ కార్యకర్త ఆహ్వానం మేరకు అయన ఇంటికెళ్లి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు.




అదే విధంగా మండల కేంద్రంలోని ఇస్లాంపురా,రంజాన్ పుర కాలనీలో ముస్లిం సహోదరులైన అబ్దుల్ రషీద్,గఫ్ఫార్ జావీద్, మోసిన్ ల ఇంటికి వెళ్లి రంజాన్ ప్రత్యేకమైన సెమియా పాయసాన్ని సేవించి ఇచ్చోడ మండల ముస్లిం సోదర సోదరిమనులందరికి రంజాన్ శుభకాకంక్షాలు తెలియచేశారు. సంతోషకరమైన వతావరణములో పండుగను జరుపుకున్నందుకు కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మండల కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి, డుక్రె సుభాష్ పాటిల్, రాథోడ్ సుభాష్, హారన్ మారుతి, బాంబార్ఖేడే గోవింద్ ,రైతు బంధు అధ్యక్షులు ముస్తఫా, లోక శిరీష్ రెడ్డి,దేవనంద్,దాసరి భాస్కర్,ఆర్గుల గణేష్,కడమంచి భీముడు, గాయకాంబ్లీ గణేష్ తదితరులు ఉన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments