Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : మండలంలోని జామిడి గ్రామాన్ని సందర్శించి సీసీ రోడ్డు నిర్మాణానికి మంగళ వారం రోజున బోథ్ శాసనసభ్యులు రాథోడ్* బాపురావు భూమి పూజ చేశారు. ఈ సంధర్బంగా గ్రామస్థులు పూలతో ఊరేగింపుగా ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వముతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, మునుపెన్నడు లేని విధంగా అద్భుత సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్నామని అన్నారు. గ్రామంలో ఇండ్లు లేని వారికి మొదటి విడతగా ఇండ్లు మంజూరు చేశారు. అదే విధంగా దళితబంధు కూడా ప్రతి అర్హులైన వారికి దక్కేలా సీఎం కృషి చేస్తున్నారని అన్నారు. పథకాల పై కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దని అన్నారు. అలాంటి వారి వల్ల పేద వారు నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు.
ఈ కార్యక్రమములో మండల కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి, సర్పంచ్ హారన్ సుభాష్, మాజీ సర్పంచ్ రాథోడ్ సుభాష్, ఎంపీటీసీ సుద్దవార్ నాగవేని వెంకటేష్, మాజీ ఎంపీపీ దుక్రే సుభాష్ పటేల్, మాజీ కన్వీనర్ మెరాజ్ హమ్మద్, ఎంపీటీసీ గాడ్గే సుభాష్, విడిసి చైర్మన్ హారన్ మారుతి పటేల్ ,భంబార్ ఖేడే గోవింద్, ముస్తఫా, రషీద్,రాథోడ్ ప్రవీణ్,బలగం రవి,గైకాంబ్లీ గణేష్,ఆర్గుల గణేష్,బూతి రాజు,మాడావి భీమ్ రావు,సాయం విశ్వనాథ్,రమేష్ ,అబ్దుల్ అజిమ్,కన్నమయ్య,బి.పి.ఆర్ గంగయ్య గ్యాతం,సుభాష్ రెడ్డి,మహేందర్ రెడ్డి,సూర్యకాంత్ మరియు భారీ సంఖ్యలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



