republichindustan.in
Newspaper Banner
Date of Publish : 10 March 2022, 5:15 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

<em>మట్కా నిర్వాహకుని అరెస్ట్</em>

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :

Thank you for reading this post, don't forget to subscribe!

ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో గురువారం రాత్రి 8 గంటల సమయంలో రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో పరిధిలోని విద్య నగర్ ఏరియాలో మట్కా నిర్వహిస్తున్నట్లు విశ్వసనియ సమాచారం రావడం తో సిసిఎస్ సిఐ ఈ చంద్రమౌళి ఆధ్వర్యంలోని బృందం చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సిసిఎస్ సిఐ వెల్లడించిన వివరాల ప్రకారం జహీర్ బిన్ అబ్దుల్లా (60) అనే వ్యక్తి ని తనిఖీ చేయగా నిందితుడి వద్ద నుండి మట్కా చిట్టీలు, రూ.2340 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడి పై రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి,తదుపరి దర్యాప్తు నిమిత్తం కోసం అప్పగించడం జరిగిందని తెలిపారు. ఈ ఆపరేషన్లో సిసిఎస్ సిబ్బంది  గంగారెడ్డి, రమేష్, హనుమంతరావు, ఠాగూర్ జగన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.