republichindustan.in
Newspaper Banner
Date of Publish : 12 February 2024, 2:17 am Digital Edition : REPUBLIC HINDUSTAN

అయోధ్యలో 60 మంది మహిళల మంగళ సూత్రాలు మాయం

అయోధ్య రామ మందిరంలో బాలరాముడు కొలువుదీరిన నేపథ్యంలో రామ్‌లల్లాను దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక ఇదే అదునుగా భావించిన దొంగలు రెచ్చిపోతున్నారు.

భక్తుల నుంచి బంగారం, నగదు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. ఇప్పటివరకు 60 మంది మహిళల మంగళ సూత్రాలు కాజేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.