రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : జిల్లాలోని ఇచ్చోడా మండల కేంద్రం లో ఓ విచిత్ర సంఘటన రిపబ్లిక్ హిందుస్థాన్ కామెర కంట పడింది. ఓ పక్కన ప్రభుత్వ యంత్రాంగం మత్తు పానీయల వల్ల ప్రజల ఆరోగ్యం చెడిపోతుందని, యువత తో పాటు అనేక కుటుంబాలలో మద్యం వల్ల పచ్చని జీవితాల్లో అంధకారంలోకి నెట్టవద్దని ప్రచారం చేస్తున్న సమయం లో మందుబాబుల పై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. తాజాగా ఇచ్చోడా పోలీస్ స్టేషన్ గేటు ముందర ఓ వ్యక్తి ఫుల్ గా తాగి , తీవ్రమైన ఎండలో లేవలేని స్థితిలో పడిపోయి ఉన్నాడు. ఇలాంటి వారు ఏంతో మంది మధ్యానికి బానిసయి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అదే విధంగా వైన్స్ షాపులలో ఓ వ్యక్తికీ విక్రాయించాల్సిన మొతాదు కంటే ధనార్జనే ధ్యేయం గా షాపు యజమానులు వ్యవహారిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇచ్చోడా మండలం లో విచ్చలవిడిగా బెల్ట్ షాపుల వల్ల ప్రతి గ్రామం లో ఇదే పరిస్థితి.
ఆగమవుతున్న పేదోని బ్రతుకు
మద్యం వల్ల మధ్యతరగతి కుటుంబాలు చిన్నభిన్నాం అవుతున్నాయి. అనేక రాష్ట్రాలు మద్యం పై నిషేధం విధించి సత్పలితాలు రాబడుతున్నాయి.


Recent Comments