– గణపతి లడ్డును దక్కించుకున్న పెందెం సాయి
– వేలం పాటలో 20011 లడ్డూ ధర
– నిమజ్జన కార్యక్రమంలో నృత్యాలు
– అంగరంగ వైభవంగా గణపతి ఊరేగింపు
అదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన చంద్ర గణేష్ మండల్ గణేష్ నిమజ్జనం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు అత్యంత భక్తిశ్రద్ధల మధ్య కాలనీ వాసులు నిర్వహించారు. ఇక్కడ లేని విధంగా రాంనగర్ చంద్ర గణేష్ మండల్ వద్ద ప్రతిరోజు సాయంత్రం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు పిల్లలకు మహిళలకు వివిధ రకాల పోటీలను నిర్వహించారు. గణేష్ నిమజ్జనం కార్యక్రమం లో భాగంగా నృత్యాలు చేస్తూ అందర్నీ ఆకర్షించారు. చిన్నారులు చేసిన డ్యాన్సులు అందర్నీ ఆకర్షించాయి. ఉదయం వేకువజామన 3 గంటల ప్రాంతంలో చందా వాగులో గణేష్ నిమర్జనాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో కిషోర్, రాజన్న, సూది శ్రీహరి, భీమ్సేన్ రెడ్డి, కృష్ణమూర్తి, పెందెం విజయకుమార్, పెండెం శేఖర్, కుమార్, నితీష్, సామనపల్లి స్వామి, సామనపల్లి రామన్న, సామనపల్లి సాయి, శ్రీనివాస్, వరుణ్, ప్రసాద్, సాయి చందర్, రుతిక్, పెండెం సాయి, అనురాగ్ తదితరులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గణపతి లడ్డు దక్కించుకున్న సాయి
రాంనగర్ కాలనీలో తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన లడ్డును కాలానికి చెందిన పెండెం సాయి ₹20011 రూపాయలకు వేలంపాటలో లడ్డు దక్కించుకున్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!
