republichindustan.in
Newspaper Banner
Date of Publish : 30 October 2022, 12:41 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

<em>కోనో కార్పస్ చెట్లను తొలగించాలి</em>

రిపబ్లిక్ హిందుస్థాన్,  పాలకవీడు : నేరేడుచర్ల మున్సిపల్ పరిధి లో తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం మొక్కల పెంపకంలో భాగంగా పలు వీధుల్లో వేసిన కోనో కార్పస్ చెట్లను వెంటనే తొలగించాలని
సామాజిక కార్యకర్తలు ఆదివారం మున్సిపల్ అధికారి అశోక్ రెడ్డి కి వినతిపత్రం సమర్పించారు.
    కోను కార్పస్ చెట్ల వల్ల ఆక్సిజన్ తగ్గిపోయే ప్రమాదం ఉందని , శ్వాస సంబంధమైన జబ్బులు వస్తాయని, 80 మీటర్ల మేర దాని వేర్లు పాకి పోయి భూగర్భ జలాలు అంతరింప చేస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మన మున్సిపాలిటీ పరిధిలో విరివిగా నాటిన ఆ మొక్కలు ఇప్పుడు పెద్ద చెట్లు గా మారాయని ప్రజలకు అనారోగ్యం కలగకుండా ఈ చెట్లను వెంటనే మున్సిపల్ చర్యలు తీసుకొని తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
    వినతి పత్రం అందించిన వారిలో సామాజిక కార్యకర్త న్యాయవాది సుంకర క్రాంతి కుమార్, సామాజిక కార్యకర్తలు జింకల భాస్కర్, కొప్పు రామకృష్ణ గౌడ్, యారవ సురేష్, జంపాల శ్రవణ్, ఆకుల సతీష్ , చారి లు పాల్గొన్నారు.