రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ (మార్చి 16) : హిందువులకు ముఖ్య పుణ్య క్షేత్రాలలో పవిత్రమైన భారత దేశంలోని ఉత్తరఖండ్ రాష్ట్రం లో రుద్ర ప్రయాగ జిల్లాలలో కేదార్ నాథ్ శివాలయానికి ముఖ్య పూజారిగా పీఠాధి పతిగా నియమితులైన శివలింగ స్వామిని గురువారం నారాయణఖేడ్ నియోజక వర్గంలోని చాప్ర గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అశోక్ ముస్తాపురె తెలంగాణ రాష్ట్ర వీరశైవ లింగాయత సమన్వయ సమితి సభ్యులతో కలిసి శివలింగ స్వామిని దర్శించుకుని ఆయనకు శాలువాతో సన్మానించి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ ముస్తాపురే మాట్లాడుతూ ఈరోజు శివలింగ స్వామీజీ దేశంలోని తొమ్మిది పీఠాలలో పవిత్రమైన కేదార్ నాథ్ ఆలయానికి ముఖ్య పీఠాధి పతిగా శివలింగ స్వామీజీని పూజారిగా నియమించడం రాష్ట్ర వీరశైలింగాయత జంగమ సమాజానికి చాలా గర్వకారణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని వీరశైవ లింగాయత్, లింగా సమాజ్ పెద్దలు తెలంగాణ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సమన్వయ సమితి జనరల్ సెక్రెటరీ సంకటాల సోమేశ్వర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కుటుంబరావు తెలంగాణ రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి జాన్వాడ సంగప్ప, నారాయణఖేడ్ నియోజకవర్గ బిజెపి నాయకులు బసవరాజ్ గణేష్, నియోజకవర్గ నాయకు లు శివలింగ స్వామిని దర్శించుకుని వారి ఆశీర్వాదాన్ని పొందారు.
Thank you for reading this post, don't forget to subscribe!