— రాహుల్ పర్యటనకు అనుమతి నిరాకరణ పై నిరసన వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలను అరెస్టు చేయడం దారుణం
— ప్రభుత్వ తీరు పై మండిపడ్డా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పురుషోత్తం సురేష్
Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్ ల్, నల్లబెల్లి:
టిపిసిసి మరియు మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నల్లబెల్లి మండల కేంద్రంలో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పురుషోత్తం సురేష్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనలో సీఎం కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిస్తుందని యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పురుషోత్తం సురేష్ అన్నారు. రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తామంటే అడ్డుకోవడం ఎందుకుని ప్రశ్నించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ని బంజారాహిల్స్ పోలీసులు నిర్బంధించడం పాశవిక పాలనకు పరాకాష్ట అని ధ్వజ మెత్తారు. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అనే అనుమానాలు వస్తున్నాయన్నారు. కెసిఆర్ కుటుంబం అనుభవిస్తున్న బోగాలన్ని కాంగ్రెస్ పార్టీ, రాహుల్, సోనియా గాంధీల బిక్ష అని, కెసిఆర్ ఒక పిరికి పాలకుడు అని, ఆయన పాలనకు మరో 12 నెలలే గడువు ఉందన్నారు. రాహుల్ పర్యటనకు అనుమతి నిరాకరణ పై విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తే అరెస్టు చేయడం దారుణమని, వారిని కలిసేందుకు వెళ్తే ఎమ్మెల్యే జగ్గారెడ్డి ని అరెస్టు చేశారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకోవాలని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి, కార్యదర్శి బానోతు రమేష్, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాలు అశోక్, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చర్ల శివారెడ్డి, నాయకులు లు రవీందర్ రెడ్డి, ఇంద్రా రెడ్డి, రఘుపతి, సుమన్, అనిల్, రాజు, సాగర్, సందీప్, శివ తదితరులు పాల్గొన్నారు.