రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : భారతీయ జనతా పార్టీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ పై ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండలానికి చెందిన మైనారిటీలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా మాజీ ఎంపిటిసి మరియు మాజీ ఎఐఎంఐఎం మండల అధ్యక్షుడు మోసిన్ మాట్లాడుతు ఎంపీ బండి సంజయ్ ఒక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడం వల్ల మైనారిటీ ల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. కమ్యూనల్ హెట్ స్పీచ్ చేసిన ఎంపీ పై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్బంగా ఇచ్చోడా ఎఎస్సై జాదవ్ లింబాజీకి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఫిర్యాదు చేసిన వారిలో వార్డ్ మెంబర్ అబ్దుల్ సోఫియాన్, అర్షద్, ఫహీమ్, అత్తర్ ముజహిద్, ఆమర్, జూనెద్, షారుక్ జామిర్, ఫెరోజ్, అసిఫ్, ఓవస్ ఆమేన్, అర్బాజ్ సనాఉల్లా, జుబెర్ కైఫ్, తన్విర్ , అఫ్రోజ్, రిజ్వాన్ లు ఉన్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!