హనుమకొండ జిల్లా : కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగంలో భూక్య హుస్సేన్ నాయక్ డాక్టరేట్ డిగ్రీని అందుకున్నారు. నిజాం కాలం నాటి బంజారా ప్రజల సంక్షేమ పథకాల గురించి పీహెచ్డీలో మంచి పరిశోధన ఫలితాలను ఆచార్య సదానందం గారి పర్యవేక్షణలో పరిశోధన సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు. మారుమూల గిరిజన ప్రాంతం నుంచి ఎంతో కష్టపడి ఉన్నతమైన విద్యను అభ్యసించినందుకు బంజారా సంఘాలు హుస్సేన్ నాయక్ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు విఎన్ నాయక్, రిటేడ్ పోరిక జవహర్ లాల్ నాయక్, రిటైర్డ్ డిఇఓ, బానోత్ వెంకట్రాం నాయక్ రిటైర్డ్ ఆర్జెడి, పోరిక నందానాయక్ రిటైర్డ్ జిఎం, కేలోతు సత్యమ్మ మాజీ జెడ్పిటిసి, అజ్మీర భోజ నాయక్ డి.సిహె.చ్, భూక్య సాంబు నాయక్ ఫారెస్ట్ రేంజర్, బంజారా జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకన్న నాయక్, సీనియర్ పాత్రికేయులు లావుడియా రాజు నాయక్, సిద్దు నాయక్, భాస్కర్ నాయక్, డాక్టర్ బానోత్ స్వామి నాయక్ మొదలగు బంజారా మిత్రులు హుస్సేన్ నాయక్ను అభినందించారు.
Thank you for reading this post, don't forget to subscribe!