Friday, June 13, 2025

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కడప పట్టణ శివారులోని రాజంపేట-కడప బైపాస్‌ రోడ్డు చెన్నూరు మండల పరిధిలోని పాలెంపల్లె వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. రాజంపేట వైపు నుండి వస్తున్న బైక్‌ను లారీ వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారు చెన్నూరు బెస్త కాలనీకి చెందిన సురేష్‌, దినేష్‌, సుబ్బయ్యలుగా గుర్తించారు. ముగ్గురు యువకులు ఒంటిమిట్ట నుండి చెన్నూరుకు బైకు మీద వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న చెన్నూరు పోలీసులు చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మతదేహాలను కడప రిమ్స్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి