republichindustan.in
Newspaper Banner
Date of Publish : 01 June 2022, 3:33 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

ఆర్ఐ ని కులం పేరుతొ దూషించిన వ్యక్తికీ ఆరు నెలల జైలు శిక్ష

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : రెవెన్యూ ఇన్స్పెక్టర్ ను కులం పేరుతో దూషించి గాయపరిచిన కేసు లో నిందితునికి ఆరు నెలల జైలు శిక్ష రూ.1500 ల జరిమానా ను ఎస్సి/ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ఎం సతీష్ కుమార్ శిక్ష విదిస్తూ తీర్పు వెలువరించారు.

*కేసుపూర్వపరాలు ఇలా ఉన్నాయి*

తేదీ 24-12-2021 నా ఉదయం 6 గంటలకు ఇంటి ముందర రోడ్డుపై గెడాం గీత మరియు తన భర్తతో వాకింగ్ చేస్తుంటే అదే కాలనీకి చెందిన పోల్కంవార్ అశోక్ s/o అంబన్న ,age 63, తిలక్ నగర్ ఆదిలాబాద్ చెందిన వ్యక్తి బాధితురాలిని అడ్డగించి బూతులు తిడుతూ ఇద్దరిపై రాళ్ళుగా రువ్వి, గాయపరిచి. అందరూ చూస్తుండగా కులం పేరుతో దూషిస్తూ అవమాన పరచి, వారిని చంపేస్తానని బెదిరించాడు. ఆమె కుడి చేతికి గాయం అయింది.
బాధితురాలు ఫిర్యాదు మేరకు అప్పటి ఆదిలాబాద్ టు టౌన్ ఎస్ఐ ఎస్ అశోక్ cr no 218/2021, u/ sec 294-b,324,506.IPC ,3(1)(r)(s) sc/St (poa) act, కింద కేసు నమోదు చేయగా ఆదిలాబాద్ డిఎస్పి ఎన్ఎస్వి వెంకటేశ్వరరావు దర్యాప్తు చేసి నివేదిక అందజేశారు.

ఇట్టి కేసులో ప్రత్యేక పీపి ఈ కిరణ్ కుమార్ రెడ్డి తొమ్మిది మంది సాక్షులను ప్రవేశపెట్టి విచారించగా, sc/st కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎం సతీష్ కుమార్ నిందితుడు *పోల్కంవార్ అశోక్( 63)కు సెక్షన్ 294 బి ఐపీసి కింద రెండు నెలల జైలు శిక్ష, 506 ఐపీసి ఆరు నెలలు మరియు రూ 500/- జరిమానా, 3(1)(r)(s) sc/St (poa) act కింద ఆరు నెలలు మరియు రూ 500/- జరిమానా విధించారు.

అన్నీ శిక్షలు ఏకకాలంలో అమలు చేయాల్సిందిగా ఆరు నెలల జైలు శిక్ష మరియు మొత్తం జరిమానా రూ 1500/- కట్టాల్సిందిగా, జరిమానా కట్టలేని పక్షంలో ఒక నెల సాధారణ జైలు శిక్ష విధించారు. కోర్టు లైజన్ అధికారి ఏం గంగా సింగ్, కోర్టు డ్యూటీ అధికారులు ఎం శ్రీనివాస్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.

Thank you for reading this post, don't forget to subscribe!