ఆలిండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా నియామకం
మంచిర్యాల జిల్లా: మంచిర్యాల జిల్లా కు చెందిన సీనియర్ పాత్రికేయులు పార్వతి రాజేష్ కు సముచిత స్థానం దక్కింది. ఆలిండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన నియామకం అయ్యారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నాటి నుండి నేటి వరకు రాజేష్ జర్నలిస్టుల సమస్యల పై క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ జర్నలిస్ట్ జేఏసీ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తన వంతు బాధ్యతలు నిర్వహించి ఉద్యమంలో పాల్గొన్నారు .రాష్ట్రంలో జిల్లా లో సహచర జర్నలిస్టుల సమస్యలపై పార్వతి రాజేష్ అనేక విధాలుగా వివిధ పోరాటాలు కొనసాగించారు .ఏ రిపోర్టర్ కైనా.. ఏం సమస్య వచ్చినా.. ప్రతిస్పందిస్తున్నారు. ముఖ్యంగా జర్నలిస్టులకు ప్లాట్లు, అక్రిడిటేషన్ ల పారదర్శకంగా కేటాయించాలని పలుసార్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులకు వినతిపత్రాలు అందించారు. ఈ క్రమంలోనే ఆలిండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు రాజేష్ సేవలను గుర్తించి ఈ బాధ్యతలు కట్టబెట్టారు. ఈ సందర్భంగా పార్వతి రాజేష్ మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో పూర్తి చేస్తానని చెప్పారు. ఈ పదవికి ఎంపిక చేసిన యూనియన్ జాతీయ అధ్యక్షులు కే. కోటేశ్వర్ రావు, రాష్ట్ర అధ్యక్షులు రాజు రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. *రానున్న రోజుల్లో జర్నలిస్టుల పక్షాన తన గళం వినిపించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అయన తెలిపారు.*
Thank you for reading this post, don't forget to subscribe!