వెంటపడి వేదించిన వ్యక్తికి ఒక సంవత్సర జైలు శిక్ష, రూ.1000 ల జరిమానా విధించిన ఫోక్సో కోర్టు జడ్జి డి మాధవి కృష్ణ
Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ – క్రైం :
ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిని (17) భాగ్యనగర్ కు చెందిన తిడేసురం అతేష్ అనే ఆకతాయి 2016 వ సంవత్సరంలో బాధితురాలి స్కూలుకు వెళ్లి అమ్మాయిని తన తండ్రి తీసుకురమ్మన్నాడని ప్రిన్సిపాల్ వద్దకు వెళ్లి అడగగా, ప్రిన్సిపాల్ కు అనుమానం వచ్చి అమ్మాయి తండ్రికి ఫోన్ చేసి కనుక్కోనగా తాను ఎవరిని పంపలేదని కూతుర్ని పంపవద్దని, తాను వస్తాను ఆయన్ని ఉంచమని చెప్పగా అది విన్న వ్యక్తి పారిపోయినాడు.
మరునాడు సాయంత్రం మళ్లీ వచ్చి పిల్లలని వదులుతున్న సందర్భంలో గేటు వద్ద ఉండి అమ్మాయిని వేధించగా అక్కడే ఉన్న సిబ్బంది అడ్డుపడగా, పట్టుకోవడానికి ప్రయత్నించగా పారిపోయినాడు.
తేదీ 22 -11 -2016న రాత్రి 9 గంటలకు పోలీస్ స్టేషన్ మావల యందు ఆమె తండ్రి దరఖాస్తు ఇవ్వగా అప్పటి ఎస్సై ఎల్ రాజు నేరస్తుని పై U/Sec 354-D IPC & 12 పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి, కేసు దర్యాప్తు చేసి, చార్జి షీటు దాఖలు చేశారు.
కోర్టు డ్యూటీ అధికారి జే భారతి సాక్షులను ప్రవేశపెట్టగా ప్రత్యేక పిపి ముస్కు రమణారెడ్డి పదిమంది సాక్షులను కోర్టు యందు విచారించి నేరము రుజువు చేయగా, ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని భాగ్యనగర్ కు చెందిన నేరస్తుడగు తిడేశురామ్ అతీష్ (21) తండ్రి.బాపు రావు, అనే వ్యక్తి కి పోక్సోకోర్టు న్యాయమూర్తి డి మాధవి కృష్ణ తీర్పు వెలువరిస్తూ నేరస్తునికి ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు రూ 1000/- జరిమానా విధించడం జరిగిందని, జరిమానా కట్టని పక్షంలో ఒక నెల సాధారణ జైలు శిక్ష విధించారని కోర్టు లైజన్ అధికారి ఎం గంగా సింగ్ తెలిపారు.