republichindustan.in
Newspaper Banner
Date of Publish : 19 January 2024, 4:52 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

ఇచ్చోడ గ్రామంలో ప్రభుత్వ ఆస్తుల కబ్జాలపై చర్యలు తీసుకోవాలి

*  గ్రామ రొడ్డు విస్తరణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి

Thank you for reading this post, don't forget to subscribe!

* జై ఆదివాసీ యువ శక్తి డిమాండ్

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :

మండల కేంద్రం,  మేజర్ గ్రామ పంచాయతీలొ ప్రభుత్వ ఆస్తులు అక్రమంగా కబ్జాలకు గురైనాయి జై ఆదివాసీ యువ శక్తి నాయకులు ఆరోపించారు.
అదేవిధంగా గ్రామంలో మెయిన్ రొడ్డుకు ప్రస్తుత మహాత్మ జ్యొతిబాపులె బాలుర స్కూల్ దగ్గర గల నీటిపారుదల కాలువ  1954 గ్రామ నక్ష  ప్రకారం కాలువ అలాగే గ్రామానికి అనుసందానం గల దారి ఉండేది. అవి ఆక్రమణలు గురైనాయి. మరియు అంబేద్కర్, శివాజీ విగ్రహాల వద్ద గల ముఖ్య డ్రెయినేజీ మురికినీటి పారుదల కాలువ అక్రమంగా కబ్జా, నిర్మాణాలు జరిగాయి. ‌దిని వలన వర్షాకాలంలో రోడ్డుపై వర్షపు నీరు వరదలా పారుతుంటుంది. అలాగే మార్కెట్ లోపల సీసీ రొడ్లకు ఇరువైపులా డ్రెయినేజీలపై అక్రమ నిర్మాణాలు జరిగాయి. ‌అలాగె అటవీ శాఖ కార్యాలయం, పెట్రోల్ పంపు దగ్గర గల బ్రిడ్జ్ కల్వర్టు అక్రమంగా కబ్జా జరిగింది. ప్రభుత్వ ఆస్తులు నాలలు, కాలువలు, దారులు, రోడ్లు , పంపులు మొదలగు ప్రభుత్వ ఆస్తులు సుప్రీం కోర్టు ఆదెసానుసారంగా  రక్షణకు జి ఒ నెం.188 పి అర్ డిపార్ట్మెంట్ కింద గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇచ్చోడ రక్షించాలి. అక్రమాలకు గురైనవాటిని చట్టం ప్రకారం తొలగించాలి. ఉల్లంఘనలు జరిగిన వాటిని చట్టం ప్రకారం చర్యలు తిసుకొవాలి. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం మండల స్తాయిలొ మండల పరిషత్ అభివ్రుద్ది అదికారి సమాచారం తెప్పించాలి.
       అలాగే ఇచ్చోడ గ్రామం పట్టణీకరణ చెందుతున్న క్రమంలో భవిష్యత్తులో ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రొడ్డు విస్తరణలో భాగంగా సెంటర్ లైటింగ్ కోసం రెండు కిలొమీటర్ల వరకు డివైడర్ ఎర్పాటు చేయాలి. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా రోడ్డుకు ఇరువైపులా 50 పిట్ల వెడల్పుతో రొడ్డు ఎర్పాటు చేసి రెండు వైపులా ప్రజలు కాలినడకన మార్కెట్ సౌకర్యం, మోటర్ సైకిల్ పార్కింగ్ కోసం సౌకర్యవంతంగా మరియు ఇరువైపులా 5 పిట్లు కంచె ఎర్పాటు చేయాలి.  వర్షపు నీరు, డ్రెయినేజీ సౌకర్యం పకడ్బందీ ఎర్పాటు చేయాలి. పబ్లిక్ టాయిలెట్ ఎర్పాటు చేయాలని జై ఆదివాసీ యువ శక్తి (JAYS) తెలంగాణ శాఖ రాష్ట్ర కొ కన్వీనర్‌ మేస్రం ఆనంద్ సంబంధిత శాఖ అదికారులను విజ్ఞప్తి చెస్తున్నాను.